హైదరాబాద్, వెలుగు: విప్రో కన్జూమర్ కేర్ పెంపుడు జంతువుల ఆహార మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.5,500 కోట్లకు పైగా విలువైన ఈ మార్కెట్లోకి స్నగ్గిల్స్ పేరుతో పోషకాహార బ్రాండ్‌ను హైదరాబాద్‌లో బుధవారం విడుదల చేసింది. శునకాల కోసం కిబుల్‌తో పాటు ఫ్రీజ్- డ్రైడ్ చికెన్ ముక్కలను కలిపిన ఆహారాన్ని అందిస్తోంది.
మనుషులు తినదగిన పదార్థాలతో, తక్కువ ధరలో నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఫుడ్స్ బిజినెస్ ప్రెసిడెంట్ అనిల్ చుగ్ తెలిపారు. ఈ ప్రొడక్టులు పప్పీ ఆల్ బ్రీడ్స్, అడల్ట్ స్మాల్ బ్రీడ్, అడల్ట్ మీడియం, లార్జ్ బ్రీడ్ రకాల్లో మార్కెట్లోకి వచ్చాయి. ప్రత్యేక పెట్ రిటైల్ స్టోర్లు, వెటర్నరీ క్లినిక్స్, మోడరన్ ట్రేడ్, ఈ–-కామర్స్, క్విక్-కామర్స్ ప్లాట్ ఫారమ్‌ల ద్వారా లభిస్తాయి. ధర రూ.530 నుంచి మొదలవుతుంది.
