జహీరాబాద్ మహీంద్రా ట్రాక్టర్స్ ప్లాంట్లో కార్మికుడి మృతి

జహీరాబాద్ మహీంద్రా ట్రాక్టర్స్  ప్లాంట్లో కార్మికుడి మృతి

జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని మహేంద్ర ట్రాక్టర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న రాజేశ్​ (34) అనే కార్మికుడు బుధవారం విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించాడు. కాగా, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు, సీఐటీయూ, వివిధ పార్టీల నాయకులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు.

యాజమాన్య ప్రతినిధులకు, నాయకులకు మధ్య జరిగిన చర్చల్లో ఘర్షణ చోటుచేసుకున్నప్పటికీ, చివరకు యాజమాన్యం దిగివచ్చి మృతుడి కుటుంబానికి రూ.7.50 లక్షల  నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించేందుకు అంగీకరించడంతో ఆందోళన విరమించారు. 

ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్. మహిపాల్ మాట్లాడుతూ ఫ్యాక్టరీలో ఎఫ్టీఈ, నాన్-రెగ్యులర్ విధానాలను వెంటనే రద్దు చేసి, కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి కనీస చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.