రజినీ మూవీలో శ్రియా.. 19 ఏళ్ల తర్వాత శివాజీ కాంబో రిపీట్..!

రజినీ మూవీలో శ్రియా.. 19 ఏళ్ల తర్వాత శివాజీ కాంబో రిపీట్..!

రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్న చిత్రం ‘ధర్మన్‌‌‌‌‌‌‌‌’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ది డెడ్లీ డాక్టర్’ ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో  సిమ్రాన్, రాశీ ఖన్నా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ సెట్‌‌‌‌‌‌‌‌లో  శ్రియా శరణ్ కనిపించింది. రజినీకాంత్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె దిగిన ఫొటోను ఇన్‌‌‌‌‌‌‌‌స్టా స్టేటస్‌‌‌‌‌‌‌‌లో పెట్టుకోవడంతో ఈ చిత్రంలో తాను కూడా కీలక పాత్ర పోషిస్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. 

మరోవైపు తన పాత్ర క్యామియో అని, లేదంటే స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో కనిపించనుందనే ప్రచారమూ జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ రావాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే 19 ఏళ్ల తర్వాత రజినీకాంత్, శ్రియా కలిసి స్ర్కీన్‌‌‌‌‌‌‌‌ షేర్ చేసుకున్న చిత్రమవుతుంది. ‘శివాజీ’ తర్వాత వీళ్లిద్దరూ కలిసి కనిపించబోయే చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌సంగీతం అందిస్తున్నాడు.  నేషనల్ అవార్డ్‌‌‌‌‌‌‌‌ విన్నింగ్‌‌‌‌‌‌‌‌ ఫైట్ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ ‘అన్బరివ్‌‌‌‌‌‌‌‌’ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌తో కలిసి మహేంద్రన్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డిస్నీ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది.