ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆగస్టు 31 వరకూ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు గ్యాస్ వినియోగదారులకు అవకాశం లభించింది. అయితే ఈ ప్రక్రియను డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు వెళ్లకుండానే మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి వద్ద నుంచే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా పూర్తి చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఈ-కేవైసీ పూర్తి చేసే విధానం:
1. మీ స్మార్ట్‌ఫోన్‌లో IndianOil ONE యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి.
2. గ్యాస్ కనెక్షన్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌తో లాగిన్ లేదా రిజిస్టర్ అవ్వండి.
3. అవసరమైతే మీ 16 అంకెల LPG ID సహాయంతో ఖాతాను లింక్ చేయండి.
4. యాప్‌లో e-KYC లేదంటే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
5. ఆధార్ అథెంటికేషన్ కోసం మీ అనుమతిని ఇవ్వండి.
6. ప్రాంప్ట్ కనిపించినప్పుడు Aadhaar FaceRD యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి.
7. సూచనల ప్రకారం ముఖాన్ని సరిగ్గా చూపించి స్కాన్ పూర్తి చేయండి.
8. ఆథెంటికేషన్‌ను సబ్‌మిట్ చేసిన తర్వాత e-KYC పూర్తయినట్లు కన్ఫర్మేషన్ వస్తుంది.
భారత్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ పూర్తి చేసే విధానం:
1. Hello BPCL యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయండి.
2. మీ గ్యాస్ నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
3. ఓటీపీ ద్వారా మొబైల్ నంబర్‌ను వెరిఫై చేసుకోండి.
4. మీ భారత్ గ్యాస్ ఎల్‌పీజీ కనెక్షన్‌ను సెలెక్ట్ చేయండి.
5. e-KYC లేదా ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్‌కు వెళ్లండి.
6. ఆధార్ ధృవీకరణకు అనుమతి తెలపండి.
7. ఫేస్ అథెంటికేషన్ కోసం యాప్ లోని సూచనలను పాటించి, అవసరమైతే Aadhaar FaceRD వాడండి.
8. ఫేస్ స్కాన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వివరాలను సబ్‌మిట్ చేసి కన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి.
హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ పూర్తి చేసే విధానం:
1. మీ మొబైల్‌లో HP Pay యాప్‌ను ఓపెన్ చేయండి.
2. మీ హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
3. మీ HP Gas ఎల్‌పీజీ ఖాతాను ఎంచుకోండి.
4. అందులో కనిపించే e-KYC లేదా ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
5. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ కోసం అంగీకారాన్ని తెలపండి.
6. స్క్రీన్‌పై వచ్చే సూచనల ప్రకారం Aadhaar FaceRD యాప్ ద్వారా ఫేస్ స్కాన్ పూర్తి చేయండి.
7. ఆథెంటికేషన్‌ను సబ్‌మిట్ చేయండి.
8. మీ ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తయినట్లు యాప్‌లో వచ్చే కన్ఫర్మేషన్ మెసేజ్ చూసుకోండి.
