ఢిల్లీ పోలీసుల వీడియోపై సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తన అమ్మమ్మ మరణవార్త పై ఢిల్లీలో పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలపై స్పందించిన దీప్కే.. తన అమ్మమ్మ మరణ వార్తను తెలియజేశామని ఢిల్లీ పోలీసులు గొప్పలు చెప్పుకుంటూ వీడియో విడుదల చేశారు.అందులో కొంత భాగాన్ని ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. అమ్మమ్మతో ఉండే తన కజిన్ తో ఎందుకు ఫోన్ మాట్లాడనివ్వలేదని ప్రశ్నించారు.కనీసం లాయర్ కు కూడా ఫోన్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని. రెండు నిమిషాలు తన ఫోన్ ఇవ్వమని అడిగితే ఢిల్లీ పోలీసులు నిరాకరించారు అభిజిత్ దీప్కే అన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు తనను అరెస్ట్ చేయడం, ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపాలని బలవంత పెట్టడం వెనక ఉద్దేశం ఏంటని దీప్కే ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ హయాంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తామని ప్రతిజ్ణ చేశారు.
నా కజిన్ నంబర్ ను తీసుకునేందుకు నా ఫోన్ ఇవ్వమని పోలీసులను అడిగాను, కనీసం లాయర్లతో అయినా మాట్లాడేందుకు ఇవ్వమని అడిగాను.. వీడియోలో ఆ భాగాన్ని ఢిల్లీ పోలీసు లు తొలగించి రిలీజ్ చేశారని అభిజిత్ దీప్కే మీడియాతో చెప్పారు. మోదీ నియంతృత్వ పాలనపై నిరసనలు కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే.
ఇదిలా ఉండగా..అమ్మమ్మ మరణ వార్తను తెలియజేసి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి నైతికంగా గొప్పలు చెప్పుకుంటున్న ఢిల్లీ పోలీసులు తెల్లవారు జామును 3.30 గంటలకు అరెస్ట్ డాక్యుమెంట్లతో తన వద్దకు వచ్చి సంతకం చేయమని డిమాండ్ చేయడమేంటని ప్రశ్నించారు.
►ALSO READ | 2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే భారత్ లక్ష్యం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!
తెల్లవారు జామున ఆ మానవత్వం అంతా ఎక్కడికి పోయిందని అన్నారు.అమ్మమ్మను కోల్పోయానని తెలిసి అరెస్ట్ పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేయడం లాయర్లతో మాట్లాడేందుకు అనుమతించే వరకు నిరాకరించానని స్పష్టం చేశానని అభిజిత్ దీప్కే చెప్పారు. అంతేకాదు అదే సమయంలో తన తల్లిదండ్రులు అరెస్ట్ విషయం మాట్లాడాలని ఫోర్స్ చేయడం వెనక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు దీప్కే.
అంతకుముందు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే అమ్మమ్మ మరణవార్తకు సంబంధించిన వీడియోను ఢిల్లీలో పోలీసులు విడుదల చేశారు. సీజేపీ నేతలు సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను రిలిజ్ చేశారు. ఈ వీడియోపై అభిజిత్ దీప్కే మీడియా ప్రశ్నించారు ఇలా స్పందించారు.
Why did you delete the part where I was asking for my phone so I could retrieve my cousin’s number? And where I was asking to let me speak to my lawyers? The same Delhi Police which is now taking the moral high ground for informing me about my grandmother’s demise and offering me a ride home came to me at 3:30 in the morning with arrest papers, demanding that I sign them. Where did all that humanity go at 3:30 AM? Despite knowing that I had just lost my grandmother, they still insisted that I sign the arrest papers. I refused until I was allowed to speak to my lawyers.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 11, 2026
