ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ఏం చేస్తారో చేసుకోండి.. వెనక్కి తగ్గేదేలేదు : రాహుల్ గాంధీ

ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ఏం చేస్తారో చేసుకోండి.. వెనక్కి తగ్గేదేలేదు : రాహుల్ గాంధీ

SIR, సీఈసీ జ్ణానేష్ కుమార్ అక్రమాలపై పోరాటం ఆగదని లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్నీ, దేశ ప్రజల గొంతుకను  రక్షించుకుంటామన్నారు. 15ఏళ్లుగా అన్యాయాన్ని  ఇకపై జరగనివ్వమని స్పష్టంచేశారు. రాజ్యాంగంపై దాడి చేసినవారిని ఓడించి తీరుతామని ప్రతిజ్ణ చేశారు. 

ప్రధాని మోదీ సర్కార్ కు భయం పట్టుకుంది.. మేమంతా బీజేపీ ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాం..  మోదీ, షా, భగవత్, జ్ణానేష్, దోవల్ ను కోర్టులో నిలబెట్టి తీరుతామన్నారు రాహుల్ గాంధీ. 

10వేలు.. 20వేలు,.30వేలు.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. లీడర్లను ,యువతను  అందరినీ అరెస్ట్ చేయండి.. మేమంతా జేపీ ప్రభుత్వాన్ని చుట్టుముడుతూనే ఉంటామన్నారు. ఓట్ చోరీ పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు రాహుల్ గాంధీ.