సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై మరోసారి బాంబుల వర్షం కురిసింది. అప్రమత్తమైన సౌదీ అధికారులు విమానాల రాకపోకలను రద్దు చేశారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దాడి చేసింది హౌతీలే అని సౌదీ అరేబియా ఆరోపిస్తుండగా హౌతీలను నుంచి ఇప్పటివకు ప్రకటన రాలేదు. ఈ దాడిలో సౌది పౌరులతోపాటు ఓ పైలట్ చనిపోయారు. మృతిచెందిన పైలట్ సుడాన్ కు చెందిన వాడుగా గుర్తించారు. రెండు రో జుల్లో క్రితమే రియాద్ ఎయిర్ పోర్టుపై బాంబా దాడి జరగడం ఇది రెండోసారి.
ఎయిర్ పోర్టులో ఏం జరిగిందంటే...
ఎయిర్ పోర్టుపై బాంబుల దాడిని ప్రత్యక్షంగా చూసిన స్థానికుల ప్రకారం.. రాజధాని రియాద్ లో రెండు సార్లు బాంబుల శబ్దం వినిపించిందని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రయాణికులకు ఎయిర్ పోర్టు ప్యాసింజర్ అ డ్వయిజరి విడుదల చేసింది. విమానాల రాకపోకలు, భద్రతపై ఎయిర్ లైన్స్ అధికారులు సంప్రదించి ప్రయాణాలు సాగించాలని కోరింది.
హౌతీలకు వ్యతిరేకంగా సౌదీ భారీ ఆపరేషన్..
ఇటీవల సౌదీ అరేబియా, దాని మిత్రదేశం యెమెన్ భారీ భూతల, వాయుసేన ఆపరేషన్ ను ప్రారంభించిన తర్వాత ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారు నెల రోజుల క్రితం హౌతీలు స్వాధీనం చేసుకున్న యెమెన్ పశ్చిమ ఎర్ర సముద్ర తీరం వెంబడి, బాబ్ ఎల్-మండేబ్ జలసంధి చుట్టూ ఉన్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యం. బాబ్ ఎల్-మండేబ్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన సముద్ర మార్గం ,ఇది హోర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ నౌకా రవాణా మార్గంగా పనిచేస్తుంది. కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం క్రమంలో హోర్ముజ్ మార్గం గుండా రవాణా ఇప్పటికే నిలిచిపోయింది, అందువల్ల ఎర్ర సముద్రం ,బాబ్ ఎల్-మండేబ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రాంతీయ భద్రత, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
