కాక్రోచ్ జనతా పార్టీ చీప్ అభిజిత్ దీప్కే , సౌరవ్ దాస్ అరెస్ట్ తర్వాత ఆ పార్టీ బాధ్యతలు చేపట్టిన అజింక్య షిండే జంతర్ మంతర్ నిరసనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనలో పెద్ద ఎత్తున నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. సీఈసీ రాజీనామా చేసేవరకు ప్రతి రోజు జంతర్ మంతర్ కు పాదయాత్ర చేస్తామని మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారుఅజింక్య షండే.
శనివారం ఢిల్లీలో జంతర్ మంతర్ 2.0 నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. నిరసనల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, యువతను, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలను పోలీసులు ఢిల్లీ ఎంట్రన్స్ లోనే అరెస్టు చేశారు. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, విద్యార్థి నేత నేహా బోరాతోపాటు రాజకీయ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మమతబెనర్జీ, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితోపాటు నిరసనల్లో పాల్గొన్న 4 వేల మంది విద్యార్థులు, యువతను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ ను నాటకీయ పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే విమానంలో దీప్కేను అదుపులోకి తీసుకున్నారు. మగ పోలీసులు అయితే ఉద్రిక్తతలు దారి తీసే అవకాశం ఉందని వ్యూహాత్మకంగా మహిళా పోలీసులతో అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ తో సహా సీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు తరలించారు.
ఇదిలా ఉండగా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ముందస్తుగా శనివారం ఉదయమే కాక్రోచ్ లకు ఓ వీడియో మేసేజ్ విడుదల చేశారు. నేను అరెస్ట్ కావచ్చు.. సీజేపీ నిరసనల బాధ్యతలను మరో నేత అజింక్ షేండే నిర్వహిస్తారని, కాక్రోచ్ అందరూ ఆయనకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు.
దీప్కే అరెస్ట్ తర్వాత బాధ్యతలు చేపట్టి అజింక్య షిండే .. కేంద్ర ప్రభుత్వాని మరో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి కొత్తగా నిరసనలు మొదలు పెడతామని, సీఈసీ రాజీనా మా చేసేవరకు తమ పోరాటం ఆగదని అన్నారు. నిత్యం జంతర్ మంతర్ వైపు మా పాదయాత్రలతో కదం తొక్కుతామని హెచ్చరించడం ఢిల్లీలో తాజా పరిస్థితులు, సీజేపీ నిరసనలపై సర్వత్రా ఉత్కంఠత కొనసాగుతోంది.
