ఈ వారం ప్రారంభం నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. గ్రహాల రాశి మార్పులు, సంచారం ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుందిఈ సమయంలో వ్యాపారం, వృత్తి, ఉద్యోగాలు, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఫలితాలున్నాయి? ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. . !
మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుందని పండితులు చెబుతున్నారు. పై అధికారుల నిర్ణయాల వలన ఆందోళన కలిగినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పని ఒత్తిడి పెరిగేఅవకాశం ఉంది. కొత్త పరిచయాల వలన లాభం కలిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. వ్యాపార బాగస్వామ్య బంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈవారం సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా రిస్క్‌లు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. కొంతమంది ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండక పోతేమోసపోయే అవకాశం ఉంది. చర్చలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుంది.
మిథునరాశి : ఈ రాశి వారికి ఈ వారం కొన్ని శారీరక సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వారం మధ్యలో తెలియని ఆందోళన వలన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కొత్త పెట్టుబడులు పెడితే అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా సంతృప్తికరంగాపనే ఉంటుంందని పండితులు చెబుతున్నారు.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశిః ఈ రాశి వారికి ఈ వారం పలుకుబడి పెరిగే అవకాశం ఉంది.మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో హోదా పెరిగే అవకాశం ఉంది. జాయింట్ ఒప్పందాలు కలసి వస్తాయి. పూర్వీకుల ఆస్తి రావడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో పెద్దల నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకుఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త రకాల వ్యాపారాలు వృద్ది చెందుతాయి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రేమ..పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
సింహరాశిః ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగాగడుపుతారు. అధికారుల అండతో అనుకున్న పనినిసాధిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారంలభిస్తుంది. కొద్దిగా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లివ్యవహారాలనువాయిదా వేయడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం పలుకుబడి పెరిగే అవకాశం ఉంది.మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో హోదా పెరిగే అవకాశం ఉంది. జాయింట్ ఒప్పందాలు కలసి వస్తాయి. పూర్వీకుల ఆస్తి రావడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో పెద్దల నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకుఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త రకాల వ్యాపారాలు వృద్ది చెందుతాయి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రేమ..పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
తులారాశి : ఈ రాశి వారికి ఈ వారంఆర్థిక పరిస్థితి చాలా సాధారణంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులన ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరగడంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలతో.. కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో మీ మాట నెగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి..
వృశ్చికరాశి:ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగాగడుపుతారు. అధికారుల అండతో అనుకున్న పనినిసాధిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారంలభిస్తుంది. కొద్దిగా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లివ్యవహారాలనువాయిదా వేయడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం చివరిలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారం మధ్యలో ప్రేమ వ్యవహారం చిగురించే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. కొంతమంది మీ పని పట్ల అసూయ కలిగే అవకాశం ఉన్నందున తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. తరులతో అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దు.
మకర రాశి: ఈ రాశి వారు ఈ వారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అధికారులు మీతో చాలా కటువుగా ప్రవర్తిస్తారు. అయినా ఏ విధమైన లోన్లీగా ఫీలవ్వదు. సమాజంలో పేరు.. హోదా.. ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. భావోద్వేగాన్ని , కోపాన్ని నియంత్రించుకోండి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. తల్లి తరపు విషయాలకు సంబంధించి గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభరాశి : వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. గ్రహ బలం కారణంగా ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయ త్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్న ప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది
మీన రాశి:ఈ వారంలో ఈ రాశి వారికి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పరులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొద్దిపాటిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. వారం మధ్యలో పనిభారం పెరుగుతుంది. పనికిరాని పనులలో సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
