గండిపేట, వెలుగు: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను ఆకట్టుకునేలా ‘షాప్ అండ్ విన్’ ప్రచారం కొనసాగుతోంది. ఎంపిక చేసిన రిటైల్ షాపుల్లో రూ.2 వేలు
అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు చేసే ప్రయాణికులు లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రచారంలో భాగంగా లగ్జరీ కారు, స్మార్ట్ టీవీ, ప్రీమియం స్మార్ట్ ఫోన్, అడ్వెంచర్ బైక్, తదితర ఆకర్షణీయమైన బహుమతులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ప్రయాణికుల షాపింగ్ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడంతో పాటు ఎయిర్పోర్ట్ లో షాపింగ్, డైనింగ్‌ను ప్రోత్సహించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రీమియం బ్రాండ్లు, ట్రావెల్ ఉత్పత్తులు, లైఫ్‌స్టైల్ వస్తువులు, వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
