అంబర్పేట్ బతుకమ్మకుంటలో మొసలి పట్టివేత.. రెండు నెలలుగా ముప్ప తిప్పలు పెట్టింది !

అంబర్పేట్ బతుకమ్మకుంటలో మొసలి పట్టివేత.. రెండు నెలలుగా ముప్ప తిప్పలు పెట్టింది !

అంబర్​పేట్, వెలుగు: బతుకమ్మ కుంటలో రెండు నెలలుగా డీఆర్ఎఫ్ సిబ్బందిని తిప్పలు పెడుతున్న మొసలిని ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 8న బతుకమ్మ కుంటలో మొసలి ఉన్నట్లు వాకర్స్ ద్వారా తెలిసింది.

అప్పటి నుంచి బతుకమ్మకుంటకు వచ్చే వాకర్స్ మొసలి వల్ల ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని భయపడ్డారు. ఎట్టకేలకు బుధవారం బతుకమ్మకుంటలో రెండు మీటర్ల పొడవు 15 కిలోల బరువు ఉన్న మొసలి పిల్లను డీఆర్ఎఫ్  సిబ్బంది పట్టుకున్నారు. దీంతో వాకర్స్  హర్షం వ్యక్తం చేశారు.