బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు(నర్మల) ప్రాజెక్టు అలుగు దుంకుతోంది ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండు కుండలా దర్శనమిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు లెవెల్ 1482.5 ఫీట్లు(కెపాసిటీ 2 టీఎంసీలు) కాగా పూర్తిస్థాయిలో నిండింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 1,650 క్యూసెక్కుల వరద వస్తుండగా కుడి కాలువకు 130 క్యూసెక్కులు వదులుతున్నారు. మరో 1,520 క్యూసెక్కులు స్లిప్ వే ద్వారా అలుగు దుంకుతున్నట్లు అధికారులు తెలిపారు.
మిడ్ మానేరుకు స్వల్ప ఇన్‌ఫ్లో
బోయినిపల్లి మండలం మన్వాడలోని శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేర్) ప్రాజెక్టుకు స్వల్ప ఇన్ ఫ్లో వస్తోంది. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు మానేరు, మూల వాగుల ద్వారా ప్రాజెక్ట్‌కు 1,199 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటిమట్టం 20.324 టీఎంసీల(పూర్తిస్థాయి నీటి నిల్వ 27. 55 టీఎంసీలు)కు చేరింది.
