గోదావరిఖని, వెలుగు: ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్రలు చేస్తోందని, ఈ అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు గమనించి మన ఓట్లను కాపాడుకునే బాధ్యత మనపైనే ఉందని రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్రాజ్ఠాకూర్ పిలుపునిచ్చారు. బుధవారం గోదావరిఖని పట్టణంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) రెండో దశకు సంబంధించి బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వే సందర్భంగా ఏ ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఏఐసీసీ మెంబర్ దీపక్ రాథోడ్, ప్రభాకర్‌రెడ్డి, ఫహీం, కార్పొరేటర్లు, లీడర్లు, బూత్‌స్థాయి ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. బుధవారం అంతర్గాం మండలం కుందనపల్లిలోని అటవీ పార్కులో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనివాస్ హాజరై మొక్కలు నాటారు.
