మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ సమీపంలో నిర్మించ తలపెట్టిన శ్రీ కోదండ రామమందిరం నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమిపూజ చేశారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు చేయగా.. ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయి భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొట్ల జయ, వివిధ పార్టీల నేతలు శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, ప్రసాద్, మల్లేశం, శ్రీనివాస్, సతీశ్ రెడ్డి, వినయ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన వార్డు సభ్యులు
మల్యాల మేజర్ గ్రామపంచాయతీకి చెందిన వార్డు సభ్యులు గాండ్ల జ్యోతి, శరణ్య, మంజుల, లహరి ముందస్తుగా ఎమ్మెల్యే మేడిపల్లికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, సతీశ్ రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
