- ఎనిమిది భవనాల్లో నాలుగు నేలమట్టం
గచ్చిబౌలి, వెలుగు: అంజయ్యనగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రమాదరకంగా ఉన్న మూడు బిల్డింగ్లను కూల్చివేసిన హైడ్రా అధికారులు.. మరో భవనాన్ని బుధవారం నేలమట్టం చేశారు. ఈ నెల 22న 50 గజాల్లో కట్టిన ఏడు అంతస్థుల భవనం కుప్పకూలి, ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
సీఎంసీ కమిషనర్ ఆదేశాలతో హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన, ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు. అంజయ్యనగర్ వరద నీటి కాల్వ చుట్టూ ఇలాంటి ఎనిమిది బిల్డింగ్లను గుర్తించి, వాటిలో ఇప్పటి వరకు నాలుగు భవనాలను నేలమట్టం చేశారు. మరో నాలుగింటిని తొలగించేందుకు సిద్ధమయ్యారు.
