హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్కంపెనీ యాక్సిస్ ఎనర్జీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందిపాడు గ్రామంలో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం లుమారాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతదేశంలో బ్రూక్‌ఫీల్డ్ ప్రారంభించిన రెన్యువల్ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ లుమారా. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ పనులను యాక్సిస్ ఎనర్జే నిర్వహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది.
జాతీయ గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా చేయడానికి భారీ సబ్‌స్టేషన్‌తో పాటు కర్నూలు మూడు సీటీయూఐఎల్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానించే పనులను కూడా ఇదే సంస్థ చేపడుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని
యాక్సిస్ ఎనర్జీ జాయింట్ ఎండీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తాము ఇప్పటికే 1.5 గిగావాట్లకు పైగా ప్రాజెక్టులను పూర్తి చేశామని, ఎనిమిది గిగావాట్లకు పైగా ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.
