అబిడ్స్, వెలుగు: రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందని సీనియర్ జర్నలిస్ట్ సతీశ్‌చంద్ర అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జెన్‌జీ యువత చేపట్టిన ఉద్యమం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఇంటికీ చేర్చాలనే ఉద్దేశంతో చేపడుతున్న సేవ్ కాన్స్టిట్యూషన్–-సేవ్ ఇండియా కార్యక్రమం అభినందనీయమన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం అబిడ్స్‌లోని సూర్యలోక్ కాంప్లెక్స్‌లో మోటివేషన్మీటింగ్నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రాజ్ మాట్లాడుతూ.. వచ్చే నెల జీహెచ్ఎంసీలోని 300 వార్డుల పరిధిలో ఉన్న సుమారు 2 వేల బస్తీలకు రాజ్యాంగ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామ గ్రామం సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజనులు, జెన్‌జీ యువత, విద్యార్థులు, నాయకులను కోరారు. కార్యక్రమంలో మాజీ డీఎస్పీ గంగాధర్, సుశీల కుమారి, సరస్వతి, హైకోర్టు ఏపీపీ ధర్మేందర్, నాయకులు ఆనంద్ కుమార్, రాజేశ్, నాగేందర్, దర్శన్ గౌడ్, నాగేశ్వరరావు, మహమ్మద్ ఫజిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
