దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి రెజీనా కాసాండ్ర మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ బ్యూటీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్యోతి ప్రజ్వలన సమయంలో తన కాళ్లకు ఉన్న చెప్పులను విప్పడం.. వాటిని ఆమె పీఎ చేతితో పట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదేం తీరు? అంటూ కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. రెజీనా ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మానవత్వం లేదా? స్టార్ డమ్ తలకెక్కి తన గతాన్ని మర్చిపోయరా? అంటూ మండిపడుతున్నారు. మరి కొందరు మాత్రం వీడియోలో కనిపించే కొన్ని సెకన్ల మాత్రమే.. అసలు సందర్భం తెలియకుండా.. ఒక వ్యక్తపై తీర్పు ఇవ్వడం సరికాదని అంటున్నారు. అసలు ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో రెజీనా లేదా ఈవెంట్ నిర్వాహకుల నుంచి స్పష్టత రావాల్సి ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ ట్రోలింగ్ పై రెజీనా ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెజీనా 'మూకుత్తి అమ్మన్ 2' మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రెజీనా మాత్రం ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనుంది. సుందర్ సి దర్శకత్వంలో ఈ చిత్రం తొలిభాగాన్ని విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చెప్పుల వివాదంపై రెజీనా ఎలా స్పందిస్తారో చూడాలి.
Completely unacceptable behaviour from Actress Regina Cassandra 💔
— 🔥 Satz 🔥 (@thala_speaks) August 25, 2026
She forget the past How she was before 😢 pic.twitter.com/YyOgZZJCp8
