ఈ ఫొటో చూడండి.. మళ్లీ మళ్లీ అలా చూస్తూ ఉండండి.. నేపాల్లో ప్రకృతి విధ్వంసం ఏ విధంగా ఉందనడానికి ఈ ఫొటోనే సజీవ సాక్ష్యం. నిన్నటి వరకు ఇలా ఉండే ఊరు.. ఇప్పుడు ఇలా అయింది. ఒకే ఒక్క నిమిషంలో ఊరు మొత్తం కొట్టుకుపోయింది. నామరూపాల్లేకుండా పోయింది. ఈ ఊరునే నేపాల్ దేశం నేపాల్, నువాకోట్ జిల్లాలోని త్రిశూలి ఏరియా.
❗️ See the village before and after the flood 🇳🇵⚠️
— sustainme.in® (@sustainme_in) August 26, 2026
🚨 Footage revealing the massive destruction caused by a catastrophic torrent in a village in Nepal’s Rasuwa District, after water, mud, and rocks swept through homes, roads, and infrastructure.
#Nepal #Floods #Rasuwa pic.twitter.com/4GDrIvRLBI
త్రిశూలి నదిలో కలిసే భోటే కోశీ నది కలిసే ప్రాంతంలో ఉంటుంది ఇది. త్రిశూలి ప్రాంతంగా పిలుస్తారు దీన్ని. నది పక్కనే.. నది గట్టునే.. నది కరకట్టపైనే వేలాది ఇళ్లు నిర్మించుకున్నారు స్థానికులు. వందేళ్లుగా ఈ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతానికి పర్యాటకులు లక్షల మంది వస్తుంటారు. చుట్టూ ఎత్తైన కొండలు.. సాయంత్రం అయితే చేతికి అంతేంతగా తెల్లటి మబ్బులు.. స్వచ్ఛమైన గాలి.. స్వచ్ఛమైన మంచి నీళ్లు.. 365 రోజూలు చల్లటి గాలులు.. పొల్యూషన్ అంటే ఏంటో వీళ్లకు తెలియనంతగా స్వచ్ఛత ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత.
అలాంటి ఈ త్రిశూలి ప్రాంతాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్.. ఆకస్మిక వరదలు. జల ప్రళయం తుడిచిపెట్టేసింది. త్రిశూలి ప్రాంతం మొత్తం బురదతో వచ్చిన వరదలో కూరుకుపోయింది. ఇప్పుడు చూస్తే.. నిన్నటి వరకు మనం చూసిన ప్రాంతమేనా ఇది అన్నంతగా మారిపోయింది. సుందరమైన ఇల్లు.. రంగు రంగుల ఇళ్లతో ఆహ్లాదంగా కనిపించే ఈ ప్రాంతం ఇప్పుడు స్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. ఈ త్రిశూలి ప్రాంతంలో 2 వేల మందికి పైగా జనం గల్లంతు అయినట్లు నేపాల్ ప్రభుత్వం చెబుతోంది. వాళ్ల ఆచూకీ ఇప్పటికీ లేదంట..
Rasuva, Nepal — Before vs. After flash floods pic.twitter.com/bUOUXReAFp
— 🌋🌋 Deep₿lueCrypto 🌋🌋 (@DeepBlueCrypto) August 26, 2026
టిబెట్‌లో పుట్టి నేపాల్‌లోని త్రిశూలి నదిలో కలిసే భోటే కోశీ నది ఉగ్రరూపం దాల్చడంతో టిమురే బజార్, రసువా సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 12 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వేల సంఖ్యలో వైరల్ అవుతున్నాయి. నేపాల్ వరద విపత్తుకు మంచు చరియలు విరిగిపడడం, గ్లేసియల్ సరస్సు బద్ధలవడం, భూకంప ప్రభావం కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
నేపాల్ వైపు నుంచి భారీగా మంచు చరియలు విరిగి లెండే ఖోలా నదిలో పడటంతో నీటి ప్రవాహం నిలిచిపోయి, ఆ తర్వాత ఒక్కసారిగా ఉప్పొంగి కిందకు దూసుకువచ్చి ఉండవచ్చని ఖాట్మండు యూనివర్సిటీ ప్రొఫెసర్ రిజన్ భక్త కాయస్థ తెలిపారు. వరద ముంచెత్తడానికి కొద్ది నిమిషాల ముందు (ఉదయం 8:37 గంటలకు) టిబెట్ భూభాగంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించాయి.
