సెహ్వాగ్– ద్రవిడ్ వారసులకి టీమిండియా నుంచి పిలుపు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు ఎంపిక!

సెహ్వాగ్– ద్రవిడ్ వారసులకి టీమిండియా నుంచి పిలుపు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు ఎంపిక!

Sehwag Dravid Sons: ఒకప్పుడు భారత జట్టును తమ విధ్వంసకర బ్యాటింగ్, క్లాసిక్ షాట్లతో ఏలిన వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌ల వారసులు ఇప్పుడు బ్లూ జెర్సీలో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో స్వదేశంలో జరగనున్న ప్రతిష్టాత్మక 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత U-19 జట్టులో ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌లు చోటు సంపాదించుకున్నారు. జూనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన ఈ 15 మంది సభ్యుల స్క్వాడ్‌లో ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ ఎంపికవ్వడం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ కిక్ ఇస్తోంది.

రాజ్‌కోట్, అహ్మదాబాద్ వేదికగా రచ్చ: 

ఆస్ట్రేలియా U-19 జట్టుతో భారత కుర్రాళ్లు 50 ఓవర్ల వన్డే సిరీస్‌తో పాటు రెడ్ బాల్ మల్టీ-డే మ్యాచ్‌లలో కూడా తలపడనున్నారు. 50 ఓవర్ల సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు సెప్టెంబర్ 18, 21, 23 తేదీల్లో రాజ్‌కోట్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు రాజ్‌కోట్‌లో మొదటి రెడ్ బాల్ మ్యాచ్, అక్టోబర్ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం B గ్రౌండ్‌లో రెండో రెడ్ బాల్ మ్యాచ్ జరుగుతాయి. ఈ వన్డే సిరీస్‌కు ఉత్తరాఖండ్ బ్యాటర్ లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రెడ్ బాల్ సిరీస్‌కి మధ్యప్రదేశ్ ప్లేయర్ యశ్‌వర్ధన్ చౌహాన్ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తాడు.

సత్తా చాటేందుకు ఆర్యవీర్, అన్వయ్ రెడీ:

లెగ్-స్పిన్ ఆల్ రౌండర్ అయిన ఆర్యవీర్ సెహ్వాగ్ ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2026) లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్ ద్రవిడ్ జులైలో జరిగిన శ్రీలంక పర్యటనలో రెండు 50 ఓవర్ల మ్యాచ్‌లలో 101 పరుగులు చేసి తన క్లాస్ చూపించాడు. కానీ ఈ ఇద్దరినీ కేవలం వన్డే జట్టుకే ఎంపిక చేయగా, రెడ్ బాల్ స్క్వాడ్‌లో చోటు దక్కలేదు. తండ్రుల పేర్లకు తగినట్లే మైదానంలో పక్కా పెర్ఫార్మెన్స్‌తో మెరిసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఈ యంగ్ స్టార్స్ పట్టుదలతో ఉన్నారు.

ఇండియా U-19 వన్డే స్క్వాడ్:

లక్ష్య రాయ్‌చందానీ (కెప్టెన్), యశ్‌వర్ధన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ బఘేల్ (వికెట్ కీపర్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), వి యశ్‌వీర్, రోహిత్ యాదవ్, షావిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్.

మల్టీ డే (రెడ్ బాల్) స్క్వాడ్:

యశ్‌వర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్‌చందానీ (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుషాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అభిప్ర్రాయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), రోహిత్ యాదవ్, ఇషాన్ ఓమ్, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాంశు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్.