న్యూఢిల్లీ: జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో ఇండియా మెన్స్, విమెన్స్ క్రికెట్ జట్ల షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 18న జపాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో విమెన్స్ జట్టు టోర్నీని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 28న మెన్స్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. రెండు జట్లకు సీడెడ్ హోదా ఉండటంతో డైరెక్ట్‌గా క్వార్టర్‌ఫైనల్స్‌లోనే ఆడనున్నాయి. చైనాలో జరిగిన గత ఆసియా క్రీడల్లో రెండు జట్లూ పతకాలు సాధించడంతో ఈసారి గోల్డ్ మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి.
మెన్స్ విభాగంలో అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉన్న గ్రూప్–ఎలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో ఇండియా తలపడనుంది. విమెన్స్ ఫైనల్ సెప్టెంబర్ 22న, మెన్స్ టైటిల్ ఫైట్ అక్టోబర్ 3న జరుగుతాయి. నాగోయా సమీపంలోని కొరోగీ అథ్లెటిక్స్ పార్క్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి.
