దులీప్‌‌‌‌ ట్రోఫీ సెమీస్‌‌‌‌‌‌‌‌లో నార్త్‌‌‌‌ జోన్‌‌‌‌

దులీప్‌‌‌‌ ట్రోఫీ సెమీస్‌‌‌‌‌‌‌‌లో నార్త్‌‌‌‌ జోన్‌‌‌‌

బెంగళూరు: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న నార్త్‌‌‌‌ జోన్‌‌‌‌ దులీప్‌‌‌‌ ట్రోఫీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అబిద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ (4/60), నిశాంత్‌‌‌‌ సింధు (2/59) బౌలింగ్‌‌‌‌లో చెలరేగడంతో బుధవారం ముగిసిన క్వార్టర్‌‌‌‌ఫైనల్లో నార్త్‌‌‌‌ జోన్‌‌‌‌ 52 రన్స్‌‌‌‌ తేడాతో వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌పై విజయం సాధించింది. 287 రన్స్‌‌‌‌ లక్ష్య ఛేదనలో భాగంగా 220/7 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 57.3 ఓవర్లలో 234 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. 

అబిద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ దెబ్బకు లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ బ్యాటర్లు తనుష్‌‌‌‌ కొటియాన్‌‌‌‌ (0), తుషార్‌‌‌‌ దేశ్‌‌‌‌పాండే (5) వరుస విరామాల్లో ఔట్‌‌‌‌ కాగా, ఉర్విల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (25)ను సింధు పెవిలియన్‌‌‌‌కు పంపాడు. 14 రన్స్‌‌‌‌ తేడాతో చివరి మూడు వికెట్లు పడటంతో వెస్ట్‌‌‌‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో 9 వికెట్లు తీసిన అబిద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఈ నెల 30 నుంచి జరిగే సెమీస్‌‌‌‌లో నార్త్‌‌‌‌ జోన్‌‌‌‌.. సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌తో, ఈస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌.. సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌తో తలపడనున్నాయి.