న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మార్కెట్లోకి ఎంజీ హెక్టర్ టొమాహాక్ హైబ్రిడ్ ఎస్‌యూవీవి విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధర రూ.25.69 లక్షలు. బ్యాటరీ కిరాయి లెక్కన అయితే రూ.21.79 లక్షలు. ఒక చార్జ్‌తో 115 కిలోమీటర్లు మైలేజ్ఇస్తుంది. పెట్రోల్ ట్యాంక్, బ్యాటరీ కలిపి మొత్తం 1,100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. డెలివరీలు నవంబర్ నుంచి మొదలవుతాయి. 1.5 లీటరు పెట్రోల్ ఇంజిన్, 20.5 కిలోవాట్ల బ్యాటరీ ఉంటాయి. 15.6 ఇంచుల స్క్రీన్ , లెవెల్-2 ఏడీఏఎస్, వీహెచ్‌ఈవీ వంటి ఫీచర్లు దీని ప్రత్యేకతలు.
