నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు !

నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు !

కొల్లాపూర్, వెలుగు: నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి అటవీ ప్రాంతంలో జరిగింది. అమరగిరి ఫారెస్ట్లో బుధవారం అధికారులు అటవీలో రెక్కీ నిర్వహిస్తుండగా ఈ ఘటన గుర్తించారు.

అక్కడక్కడ గుప్తనిధుల కోసం తీసిన గుంతలను పరిశీలించారు. అమరగిరి ఫారెస్ట్ లో గుప్త నిధులు ఉన్నాయని అపోహలు మాత్రమేనని, అటువంటివి నమ్మొద్దని అనుమతి లేకుండా అడవిలోకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ వాణికుమారి హెచ్చరించారు.