న్యూయార్క్: పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా కీలక పాత్ర పోషించగలవని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. సీ-స్పాన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం బెదిరింపులకు పరిమితం కాకుండా దౌత్య నీతిని ఉపయోగిస్తే యుద్ధం ముగింపుకొస్తుందన్నారు.
వ్యూహాత్మక స్థాయిలోని అపోహలే ప్రస్తుత పరిస్థితులకు దారితీశాయన్నారు. ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకునేది భారత్, చైనాలేనని గుర్తుచేస్తూ.. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఆ రెండు దేశాల సహకారం ఎంతో కీలకమని ఆమె చెప్పారు. ముఖ్యంగా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే సత్తా చైనాకు ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.
