Nepal floods: నేపాల్ వరదల్లో 98కు చేరిన మృతుల సంఖ్య.. 28 దేశాలకు చెందిన 579 టూరిస్టులు గల్లంతు

Nepal floods: నేపాల్ వరదల్లో 98కు చేరిన మృతుల సంఖ్య.. 28 దేశాలకు చెందిన 579 టూరిస్టులు గల్లంతు

నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. మధ్య నేపాల్ ను ఆకస్మికంగా భారీ వరద ముంచెత్తింది. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకొని మృతి చెందిన వారి సంఖ్య 98  కు చేరింది. నేపాల్ లో ఆకస్మికంగా భోటె కోషి నది ఉప్పొంగడంతో  నదీ తీరప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరిగింది. 12 కు పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో భొటెకోసి నది ఉప్పొంగి వరద్ ఉధృతంగా ప్రవహిచండంతో టిబెట్ సరిహద్దులోని రసువా, ధాడింగ్ జిల్లాలతోపాటు రాజధాని కాట్మండు సమీపంలో ఉన్న నువాకోట్ జిల్లాల్లో భారీ విధ్వంసం సంభవించింది.  టిబెట్ నుంచి ఒక్కసారిగా వచ్చి  నీటి వరదకు భోటెకోసి  నది ఉప్పొంగినట్లు తెలుస్తోంది. 

నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరగడంతో సంభవించిన వరదల్లో  మరో 579 మంది గల్లంతయ్యారు. వీరిలో 28దేశాలకు చెందిన 466  మంది టూరిస్టులు, 113 మంది నేపాలీలు ఉన్నారు. గల్లంతయిన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది  ప్రవాస భారతీయులు, మిగతావారు అమెరికా, మలేషియా, యూకే, దక్షిణాఫ్రికా,  ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్  దేశాలకు చెందిన టూరిస్టులుఉన్నారు. బాధితుల సాయం కోసం నేపాల్ టూరిజం బోర్డు ఎమర్జెన్సీ నంబర్లను ఏర్పాటు చేసింది. సాయంకోసం 1234 టోల్ ఫ్రీ నంబరు, 1144 హాట్ లైన్, టూరిస్ట్ పోలీస్ నంబర్  9851289445 కి కాల్ చేయాలని కోరింది.