- చైనా విదేశాంగ శాఖ ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్‌తో ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించే దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను చైనా బేఖాతరు చేసింది. ఆ దేశంతో తమ సంబంధాలు దెబ్బతినకుండా లేదా బలహీనపడకుండా చూసుకుంటామని, ఆర్థిక సంబంధాలను కాపాడుకుంటామని స్పష్టం చేసింది.
ఇరాన్‌తో లావాదేవీలు జరుపుతున్న డజన్ల కొద్దీ చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన గంటల వ్యవధిలోనే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఈ మేరకు స్పందించారు. తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి చైనా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
