రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం మరోసారి క్షిపణి దాడి జరిగింది. రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్‌కు చెందిన హౌతీలు జరిపిన దాడిలో 12 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారని సౌదీ అరేబియా తెలిపింది.
చనిపోయిన వారిలో నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) తెలిపింది. మృతులలో అమెరికా, జోర్డాన్, పాలస్తీనా, సిరియా, సూడాన్, ఈజిప్ట్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. గాయపడిన వారిలో 309 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ దాడిలో ప్రయాణికుల టెర్మినల్ దెబ్బతిన్నట్లు, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ఇద్దరు ప్రాంతీయ అధికారులు వెల్లడించారు. దాడి నేపథ్యంలో విమానాశ్రయాన్ని వెంటనే ఖాళీ చేయించారు. అంబులెన్సులు హుటాహుటిన విమానాశ్రయానికి తరలివెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాజధాని నగరంలో 2 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని రియాద్ నివాసి అహ్మద్ సయ్యద్ అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు.
ఈ క్షిపణి దాడితో విమానాశ్రయంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గడచిన 24 గంటల్లో 225 విమానాలు రద్దయినట్లు ఫ్లైట్‌అవేర్ ట్రాకింగ్ సైట్ పేర్కొంది. రియాద్‌కు రావలసిన విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు ఫ్లైట్ రాడార్24 తెలిపింది.
