Harmanpreet Kaur: దుబాయ్ వేదికగా ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా వచ్చే వారం పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో, ఆ జట్టు కెప్టెన్‌కు హ్యాండ్‌షేక్ ఇచ్చే ప్రసక్తి లేదనే సంకేతాలను భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ఇచ్చారు. టోర్నమెంట్‌కు ముందు జరిగిన కెప్టెన్ల విలేకరుల సమావేశంలో దీనిపై అడిగిన ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానమివ్వకుండా దాటవేశారు. తమ దృష్టి అంతా కేవలం మైదానంలో మంచి క్రికెట్ ఆడటంపైనే ఉందని స్పష్టం చేశారు. మేము ఏ ఒక్క నిర్దిష్ట జట్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదు.. ప్రతీ మ్యాచ్ మాకు సవాలే.. అన్ని జట్లూ బాగా ఆడుతున్నాయి కాబట్టి దేన్నీ తక్కువగా అంచనా వేయకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నారు.
పహల్గామ్ దాడి తర్వాత మారిన పరిణామాలు:
పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత భారత్– పాకిస్తాన్ మధ్య క్రీడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడికి నిరసనగా ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలతో పాటు అన్ని స్థాయిల్లోనూ పాక్ ఆటగాళ్లతో కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయకూడదనే ప్రోటోకాల్‌ను ఇండియన్ టీమ్స్ పాటిస్తూ వస్తున్నాయి.
పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తున్న భారత్:
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2025 మహిళల ప్రపంచకప్‌తో పాటు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ పాక్ కెప్టెన్‌తో హ్యాండ్‌షేక్‌కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లోనూ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అదే విధానాన్ని కొనసాగించబోతున్నట్లు తెలుస్తుంది.
భారత మ్యాచ్‌ల షెడ్యూల్:
* ఆగస్టు 30 (ఆదివారం): భారత్ వర్సెస్ థాయిలాండ్
* సెప్టెంబర్ 3 (గురువారం): భారత్ వర్సెస్ హాంగ్‌కాంగ్
* సెప్టెంబర్ 5 (శనివారం): భారత్ వర్సెస్ పాకిస్తాన్ (హై-వోల్టేజ్ సమరం)
Indian captain Harmanpreet Kaur Bhullar replies to a journalist when being asked about the handshake with the Pakistan team.
— Khel Shel (@khelshel) August 27, 2026
VC: PCB#PAKWvINDW | #Cricket | #Pakistan | #HarmanpreetKaur | #India | #AsiaCup pic.twitter.com/XiZFidkK02
