యునిసెఫ్‌‌‌‌ ఇండియా సెలబ్రిటీ అడ్వొకేట్‌‌గా స్మృతి మంధాన

యునిసెఫ్‌‌‌‌ ఇండియా సెలబ్రిటీ అడ్వొకేట్‌‌గా స్మృతి మంధాన

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌‌ జట్టు నూతన కెప్టెన్‌‌ స్మృతి మంధానకు మరో అరుదైన గుర్తింపు లభించింది. యునిసెఫ్‌‌ ఇండియా ఆమెను సెలబ్రిటీ అడ్వొకేట్‌‌గా నియమించింది. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించింది.  

“యునిసెఫ్‌‌ ఇండియా సెలబ్రిటీ అడ్వొకేట్‌‌గా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్‌‌ ఆడుతూ పెరగడం వల్ల ప్రతి కలకు ఒక అవకాశం అవసరమని తెలుసుకున్నా. కష్టపడి పనిచేయడం, పట్టుదల, ప్రోత్సాహం తోడైతే ఆ అవకాశం అసాధారణ విజయంగా మారుతుంది. ప్రతి చిన్నారి, యువకుడు పెద్ద కలలు కనేందుకు, తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు అవకాశం పొందాలి” అని మంధాన పేర్కొంది.