వెల్లింగ్టన్: భారత్‌తో వందేళ్ల క్రీడా సంబంధాలకు గుర్తుగా వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రత్యేక జెర్సీ ధరించనుంది. భారతీయ కమల పూలు, మండల ఆర్ట్స్‌తో రూపొందించిన ఈ పరిమిత ఎడిషన్ జెర్సీకి ‘కొటాహితంగా’ అని పేరు పెట్టారు. క్రికెట్‌పై ఇరు దేశాలకున్న అభిమానం, ఉమ్మడి చరిత్ర, పరస్పర గౌరవానికి ఈ జెర్సీ ప్రతీకగా నిలవనుంది. బెన్ థామసన్, శివ్ నరందాస్, జై పంచా కలిసి ఈ జెర్సీని రూపొందించారు.
ఇండియన్ నేషనల్ ఫ్లవర్ లోటస్, మండల ఆర్ట్ నుంచి నరందాస్, ఉపయోగించారు. ఇవి మావోరీ కళా సంప్రదాయాలతో సహజంగా కలిసిపోయేలా డిజైన్ చేశారు. థామసన్ సంప్రదాయ మావోరీ చిత్రకళలోని ‘కోవ్‌హైవ్‌హై’ నమూనాలను, ‘హైహై’ రేఖల నేపథ్యంపై పొందుపరిచారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని నిర్మించినవారిని గౌరవిస్తూ, ఆ అనుబంధాన్ని ఈ డిజైన్ ప్రతిబింబిస్తుందని న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.
