ఎల్ నినో ప్రభావం దక్షిణాదిపై ఎక్కువే.. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం

ఎల్ నినో ప్రభావం దక్షిణాదిపై ఎక్కువే.. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం
  • రైతులు రెండో పంట వేసి ఇబ్బంది పడొద్దు: మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. ఎల్ నిలో ప్రభావం తీవ్రం అవుతున్నందున రైతులు రెండో పంట సాగు చేయొద్దని సూచించారు.

 ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక కరువు ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రెటెడ్ స్కూల్ బిల్డింగ్ పనులను ఆదివారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దివాకరతో కలిసి పరిశీలించారు. 

అనంతరం కూసుమంచి మండలం మంగలితండా, -దుబ్బతండా మధ్య రోడ్డు పనులకు, జుజ్జుల్ రావుపేటలో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. మంగలితండాలో పంచాయతీ బిల్డింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యుత్ రూ.7 నుంచి రూ. 8కే లభించేదని, ప్రస్తుతం కొరత కారణంగా రూ.15 చెల్లించినా విద్యుత్ దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.

 భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆఫీసర్లు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆఫీసర్లకు సూచించారు. 

ఆయా కార్యక్రమాల్లో ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కూసుమంచి మండల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. హఫీజుద్దీన్ పాల్గొన్నారు.