హైదరాబాద్, వెలుగు: ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వ అధినేతగా నరేంద్ర మోదీ విజయవంతంగా 25 ఏండ్ల ప్రజా పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘నాగరిక్ దేవో భవ’ అనే మార్గదర్శక సూత్రాన్ని నేతలు కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ విశేష లబ్ధి పొందిందని.. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లకుపైగా నిధులు సమకూర్చిందని స్పష్టం చేశారు. అలాగే, సేవా భావం, రాష్ట్ర సేవా నిబద్ధతను చాటిచెబుతూ తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ విస్తృత సేవా కార్యక్రమాలను ఈ సమావేశం ప్రశంసించింది.
