చేవెళ్ల మండలంలో గొర్రెల మందపై కుక్కల దాడి.. 23 గొర్రెలు మృతి

చేవెళ్ల మండలంలో గొర్రెల మందపై కుక్కల దాడి.. 23 గొర్రెలు మృతి

చేవెళ్ల, వెలుగు: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 23 గొర్రెలు చనిపోయాయి. చేవెళ్ల మండలం ముడిమ్యాలకు చెందిన మొండ్ర మల్లేశ్​గొర్రెల పెంపకంపై ఆధారపడ్డాడు. శనివారం గొర్రెలను మేపుకొచ్చిన ఆయన రాత్రి షెడ్‎లో ఉంచాడు. ఆదివారం తెల్లవారుజామున కుక్కల గుంపు షెడ్​లోకి చొరబడి గొర్రెలపై దాడి చేశాయి. కుక్కల దాడిలో 23 గొర్రెలు చనిపోగా, మరో 15 గొర్రెలు గాయపడ్డాయి.  గాయపడ్డ వాటికి చికిత్స చేశామని, చనిపోయిన గొర్రెల విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని వెటర్నరీ డాక్టర్ మునీరుద్దీన్ చేవెళ్ల ఓఎస్​ ఎండీ ఖలీల్​చెప్పారు. గొర్రెల పెంపకంపైనే ఆధారపడి బతుకుతున్నానని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.