హైదరాబాద్, వెలుగు:వర్ధమాన ఫ్యాషన్ డిజైనర్ల ప్రత్యేక కలెక్షన్లను ఒకే వేదికపైకి తెస్తున్న అత్యాధునిక మల్టీ డిజైనర్ స్టోర్ వియోనారా హైదరాబాద్ బంజారాహిల్స్లో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో వెస్ట్రన్ వేర్, ఇండో-–వెస్ట్రన్ దుస్తులు, పెండ్లి వేడుకల ప్రత్యేక దుస్తులతో పాటు ఆభరణాలు, ఫుట్వేర్ అందుబాటులో ఉన్నాయి. సమంత్ చౌహాన్, సిద్ధార్థ్ బన్సల్, స్వాతి విజయవర్గీయ, అబ్రహం అండ్ ఠాగూర్, మందిరా విర్క్ వంటి ప్రముఖుల డిజైన్లు ఈ స్టోర్లో లభిస్తాయి. కస్టమర్లకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తామని వియోనారా ఫౌండర్లు ఈ సందర్భంగా తెలిపారు.
