స్టెవార్డ్ రెడ్క్వీన్ సర్వే : యూబీఎల్ ద్వారా 41,300 మందికి ఉపాధి

స్టెవార్డ్ రెడ్క్వీన్ సర్వే : యూబీఎల్ ద్వారా 41,300 మందికి ఉపాధి

హైదరాబాద్​, వెలుగు:యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) తెలంగాణ ఆర్థిక రంగానికి భారీగా తోడ్పాటు అందిస్తున్నట్లు స్టెవార్డ్ రెడ్​క్వీన్ సర్వే వెల్లడించింది. 20-25లో కంపెనీ వ్యాల్యూ చైన్ ద్వారా రాష్ట్రానికి రూ.7700 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. 

41,300 మందికి ఉపాధి లభించింది. ఇది తెలంగాణ జీడీపీలో 0.5 శాతానికి సమానం. కంపెనీ స్థానిక సరఫరాదారుల నుంచి రూ.1200 కోట్ల విలువైన వస్తువులు, సేవలను కొనుగోలు చేసింది. పన్నుల రూపంలో రూ.5900 కోట్లు చెల్లించింది. జల్ శక్తి ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది.