హైదరాబాద్, వెలుగు: జ్యూయలరీ బ్రాండ్ జూరీ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టింది. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 25 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్ భవన్ రోడ్డులో తొలి స్టోర్‌ను ఈనెల18న ప్రారంభించనున్నట్లు ఫౌండర్లు మహేష్, సాయి, అంకుష్ తెలిపారు.
రాబోయే మూడు నెలల్లో సిటీలోనే నాలుగు స్టోర్లను ప్రారంభిస్తామన్నారు. పారదర్శకత, నాణ్యమైన బంగారం, ధ్రువీకరించిన వజ్రాలు, నగలను అందిస్తామని అన్నారు. ఫోకో ఫ్రాంచైజీ మోడల్ ద్వారా వ్యాపారులను ప్రోత్సహిస్తామని చెప్పారు.
