రాహుల్ గాంధీ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు.. మరో 10 మంది పిటిషన్లు నమోదు

రాహుల్ గాంధీ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు.. మరో 10 మంది పిటిషన్లు నమోదు

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ)లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ నమోదైంది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరున అధికారికంగా సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పిటిషన్ రిజిస్టర్ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. 

2026 అక్టోబర్ 12న రాహుల్ గాంధీ ఛలో సుప్రీం కోర్టు ర్యాలీ (డెమొక్రసీ మార్చ్)లో ఉండటంతో ఆయన తరఫున లాయర్ ఎస్.ప్రసన్న పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై పిటిషన్ దాఖలు చేశారు. 

ఒకవైపు రాహుల్, ప్రియాంక ఇండియా కూటమి తలపెట్టిన డెమొక్రసీ మార్చ్ లో ర్యాలీని లీడ్ చేస్తుండటంతో పిటిషన్ వేయడం కుదరలేదు. దీంతో లాయర్ పిటిషన్ దాఖలు చేశారు.

రిట్ పిటిషన్ వేసేందుకు సుప్రీం కోర్టు విధించిన 4.30 pm డెడ్ లైన్ కు గడువు ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ లీగల్ టీమ్ అంతకు ముందు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే రాహుల్ ర్యాలీలో ఉండటంతో ఆయన తరఫున లీగల్ టీమ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటీషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించింది. దీనికి సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లో నమోదు చేసింది.

ALSO READ : మోదీ ప్రభుత్వంలోని 200 మంది ఆఫీసర్లు మాతో టచ్లో ఉన్నారు 

మరో 10 పిటిషన్లు నమోదు:

సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీతో పాటు మరో పది మంది ఇండియా బ్లాక్ నేతలు సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారు. లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు  ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ ఎంపీ సాగతా రాయ్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ ప్రతాప్ యాదవ్, శివసనే (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, సీపీఐ (ఎం) ఎంఏ బేబీ, సీపీఐ నేత డీ.రాజ, మహువా మాఝీ, సుప్రియా సూలే, ఈటీ మొహమ్మద్ బషీర్ లు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.