నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. తొలుత 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, నీటి ప్రవాహాన్ని 6,000 క్యూసెక్కులకు పెంచి కొనసాగిస్తామని వెల్లడించారు.కాలువకు నీటి విడుదల కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సాగునీరు అందుబాటులోకి రావడంతో పంటల సాగుకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఎడమ కాలువ ద్వారా నీటి సరఫరా కొనసాగనుండటంతో ఆయకట్టు పరిధిలోని రైతులకు ఊరట లభించనుంది.