పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, దుండిగల్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
మొత్తం ఖాళీలు: 8.
విభాగాల వారీగా ఖాళీలు: పీజీటీ (జియోగ్రఫీ & హిస్టరీ), టీజీటీ (మ్యాథ్స్ & స్పెషల్ ఎడ్యుకేటర్), ప్రైమరీ టీచర్స్ (పీఆర్టీఎస్), స్టాఫ్ నర్స్ (మహిళ), స్పోర్ట్స్ కోచ్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ (మహిళ) మ్యూజిక్ కోచ్, కౌన్సెలర్.
విద్యార్హతలు
పీజీటీ: గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (బీఈడీతో సహా) పూర్తి చేయాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ పూర్తిచేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ కోర్సు పూర్తి చేయాలి. లేదా బీఈడీతోపాటు కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కలిగి ఉండాలి.
టీజీటీ: కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు(బీఈడీతో సహా) పూర్తిచేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్/ ఆనర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ డిగ్రీ ఉండాలి.
పీఆర్టీ: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. లేదా
కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసి ఉండాలి.
స్టాఫ్ నర్స్: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు నర్సింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. లైఫ్ సేవింగ్ స్కిల్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
కౌన్సిలర్: కనీసం 50 శాతం మార్కులతో బీఏ లేదా బీఎస్సీ సైకాలజీ పూర్తి చేయాలి. దీంతోపాటు కౌన్సిలింగ్‌లో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
స్పోర్ట్స్ కోచ్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న అనుభవం ఉండాలి. స్పోర్ట్స్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. కోచ్‌గా లేదా ఆటగాడిగా ఎన్‌ఐఎస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
టీజీటీ (స్పెషల్ ఎడ్యుకేటర్): గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేయాలి. కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ (జనరల్)తోపాటు ఏడాది స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కలిగి ఉండాలి.
మ్యూజిక్ కోచ్: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. సంగీతం/ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ చదివిన అన్ని సంవత్సరాల్లో సంగీతం ఒక ప్రధాన సబ్జెక్టుగా చదివి ఉండాలి.
సెల్ఫ్ డిఫెన్స్ కోచ్: సెల్ఫ్ డిఫెన్స్ లేదా మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా లేదా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 13.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ no1dundigal.kvs.ac.inను సందర్శించండి.
