కేసీఆర్పై హిమాన్షు ట్వీట్ వైరల్

కేసీఆర్పై హిమాన్షు ట్వీట్ వైరల్
  • పులి ఫొటోను పోస్ట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా
  • అన్నీ గ‌మ‌నిస్తున్నానంటూ పులి చెబుతున్న‌ట్లుగా ట్వీట్‌
  • మీ ఇంట్లో ఇలాంటి వారెవ‌రంటూ మ‌హీంద్రా ప్ర‌శ్న‌
  • మా తాత గారేనంటూ ఆన్స‌రిచ్చిన కేసీఆర్ మ‌న‌వ‌డు

సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కేటీఆర్ కొడుకు హిమాన్షు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాతయ్య కేసీఆర్ పులి అంటూ చేసిన ట్వీట్పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా  ఓ పోస్ట్ చేశారు. సైలెంట్గా అన్నీ ప‌రిశీలిస్తున్న ఓ పులి ముఖం ఫొటోను పోస్ట్ చేసిన మ‌హీంద్రా... నేనేమీ రియాక్ట్ కాను. అయితే అన్నింటినీ సైలెంట్గా గమనిస్తానని న‌మ్ము అనే విషయాన్ని టైగర్ చెబుతున్న‌ట్లుగా ట్వీట్ చేశారు. మీ ఇంట్లో ఈ త‌ర‌హా కేట‌గిరీ వ్య‌క్తి ఎవ‌రంటూ మ‌హీంద్రా ప్ర‌శ్న‌ వేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన హిమాన్షు... 'మా ఇంట్లో అయితే మా తాత గారు ( సీఎం కేసీఆర్‌)' అంటూ రిప్లై ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


ఆగస్టు 11న చేసిన ఈ ట్వీట్ వైరల్ కాగా.. కేసీఆర్పై కొంతమంది ప్రశంసిస్తుండా.. మరి కొంత మంది దుమ్మెత్తిపోస్తున్నారు. మీ తాత మనిషి కాదా జంతువా అంటున్నారు. ఇంట్లో పిల్లి.. అడవిలో పులి. మీ తాత  ప్రెస్మీట్లు పెట్టి పిచ్చోనిలాగ ఓర్లుతుండు రా బాబు అంటూ మరికొంత మంది సెటైర్లు వేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలైతే హిమాన్షుకు సపోర్ట్ చేస్తూ .. ఎప్పటికీ మా లీడర్ కేసీఆర్ పులేనంటూ రిప్లై ఇస్తున్నారు. ఈ పోస్ట్ పై హిమాన్షును కూడా వదిలిపెట్టలేదు..  నీకు మంచి స్కోప్ ఉంది చిన్నా...జబర్దస్త్ లో ట్రై చేయ్... టైమింగ్ చాలా బాగుందని కామెంట్ చేశారు. బెంగాల్ టైగర్ మా కేసీఆర్ అని కేసీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గ‌తంలో మ‌హీంద్రా ట్వీట్ల‌కు కేటీఆర్ స్పందించ‌గా...తాజాగా మ‌హీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించ‌డం గ‌మ‌నార్హమంటున్నారు. మొత్తానికి ఆనంద్ మ‌హీంద్రా విసిరిన ట్వీట్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.