జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

బెంగళూరు: జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ప్రిపరేషన్‌ కోసం స్టూడెంట్ల-కు అకాడమీని తీసుకొచ్చింది అమెజాన్ ఇండియా. ఈ ఆన్‌ లైన్ ప్రిపరేషన్‌ ద్వారా జేఈఈలో వచ్చే అంశాలపై పూర్తి నాలెడ్జ్ ఇవ్వనుంది. లెర్నింగ్ మెటీరియల్, లైవ్ లెక్చర్స్ , మ్యాథ్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో అసైన్‌మెంట్లను ఇది ఆఫర్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌ లో అమెజాన్ అకాడమీ బీటా వెర్షన్ ఉచితంగా అందుబాటులో ఉంది. లెర్నింగ్ మెటీరియల్, ఎగ్జామ్ కంటెంట్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ పర్ట్ ఫ్యాకల్టీతో రూపొందించారు. జేఈఈతో పాటు బిట్స్‌ శాట్, ఎస్‌ఆర్‌ఎం జీఈఈఈ, ఎంఈటీ ఎగ్జామ్స్‌ కు ప్రిపేర్ అయ్యేవారు కూడా ఈ కంటెంట్ వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం ఈ కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉందని, వచ్చే కొన్ని నెలల వరకు ఉచితంగానే అందిస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది.

ఇవీ చదవండి..

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే