Virosh reception: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన ప్రముఖులు..

Virosh reception: విరోష్ వెడ్డింగ్  రిసెప్షన్ కు హాజరైన ప్రముఖులు..

హైదరాబాద్  బంజారాహిల్స్ తాజ్ క్రిష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతుల రిసెప్షన్ ఘనంగా జరుగుతోంది. విజయ్ దేవర కొండ వైట్ పంచె,భుజంపై కండువతో అదిరిపోయే లుక్ లో కనిపించారు. ఇక రష్మిక రెడ్ శారీలో మెరిశారు.  ఫస్ట్ ఇరు ఫ్యామిలీలతో కలిసి నూతన దంపతులు ఫోటోలు దిగారు. ఈ   రిసెప్షన్ కి సినీ,రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. 

తెలంగాణ గవర్ణర్ జిష్ణు దేవ్ వర్మ,  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, కేటీఆర్ దంపతులు, హైదరాబాద్ సీపీ సజ్జనార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, కేవీపీ రామచందర్ రావు,   డైరెక్టర్ సుకుమార్, బుచ్చిబాబు, బాబి, నాగార్జున, నాగచైతన్య, వెంకటేశ్,రవితేజ,శ్రీకాంత్ దంపతులు,  నిర్మాత దిల్ రాజు దంపతులు,మహేశ్ బాబు సతీమణి నమ్రతా, హీరో కార్తీ,  నవీన్ పొలిశెట్టి, నిర్మాత నవీన్ ఎర్నేణి, నటి కృతిశెట్టి, సింగర్ చిన్మయి, నాగవంశీ, సందీప్ కిషన్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

విజయ్ భావోద్వేగ మాటలు

రిసెప్షన్ వేడుకకు కొద్ది గంటల ముందు, ఈ జంట తెలుగు మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూనే, ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది.. ఆమెను మీరంతా మంచిగా చూసుకోవాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి అంటూ విజయ్ తన సతీమణి రష్మికను పరిచయం చేశారు.  మా జర్నీలో మీడియా ఎప్పుడూ ఒక భాగంగానే ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక జంటగా మీ ముందుకు రావడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. కాలం గడిచిపోతోంది, మేం పెద్దవాళ్లం అవుతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం. మీరు మా గుండెల్లో ఉంటారు అని పేర్కొన్నారు.

కొత్త అధ్యాయం మొదలైంది

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. మేం కలిసి జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాం. మీ అందరి ప్రేమ, మద్దతు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను  అని ఆమె చిరునవ్వుతో తెలిపారు.  మీ ఆదరాభిమానాలతో ముందు సాగుతామని అన్నారు.


అభిమానులకు 'స్పెషల్ దావత్'

సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు అత్యంత రహస్యంగా జరుగుతుంటాయి. కానీ, విజయ్ - రష్మిక మాత్రం తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా వేల సంఖ్యలో అభిమానులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేసి, అందరినీ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. అభిమానుల పట్ల విజయ్ చూపిన ఈ ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.