మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారం పరిధిలోని పట్టపగలే చోరీ జరిగింది. పక్కింటికి వెళ్లి వచ్చే లోపే ఇంట్లో బంగారం మాయం చేశారు దొంగలు. ఆదివారం (ఆగస్టు2) మధ్యాహ్నం పోచారం పీఎస్ పరిధిలోని యమ్నంపేటలో ఓ ఇంట్లో చొరబడి 9తులాల బంగారం, 50 వేల రూపాయలు ఎత్తు కెళ్లారు. వివరాల్లోకి వెళితే..
పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని యమ్నంపేటలో మధు(65), వినోద(55) భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం మధు బయటికి వెళ్లగా అతని భార్య వినోద పక్కింటికి వెళ్లి వచ్చే లోపే చోరీ జరిగింది. ఇంటి తలుపులు, బీరువా పగలగొట్టి 9 తులాల బంగారం, 50వేల రూపాయల నగదు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు.
►ALSO READ | ఫ్రెండ్షిప్ డే రోజున విషాదం... విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనస్థలంలో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజ్ తో నిందితులనుపట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
