లెజెండరీ సింగర్, భారత రత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ షూటింగ్ అఫిషియల్గా మొదలైంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షాట్కు కమల్ హాసన్ క్లాప్ కొట్టారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ సినిమా లాంచ్ ఈవెంట్ను చెన్నైలో నిర్వహించారు. ఈ బయోపిక్కు ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అల్లు అరవింద్, బన్నీ వాసు, రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
A beautiful, unexpected moment at the #MSBiopic launch. ❤️#Rashmika beautifully hummed #MSSubbulakshmi Amma’s timeless classic Bhagyada Lakshmi Baramma, a moment that felt truly emotional and special.pic.twitter.com/ua4JLGraE1
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) September 16, 2026
'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. శరవేగంగా షూటింగ్ జరగనుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. సంగీతంతో ఈ సినిమాకు ఉండే సంబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఈ సినిమా అనిరుధ్కు ఒక ఛాలెంజ్ అని చెప్పక తప్పదు. హీరోయిన్స్ బయోపిక్ వెండితెరపై చాలానే చూశాం.
"Thank You #MSSubbulakshmi amma for making me part of your life story"
— Rajesh Manne (@rajeshmanne1) September 16, 2026
- @iamRashmika#MSBiopic pic.twitter.com/SEL6O3c0XA
‘డర్టీ పిక్చర్’ సినిమాతో సిల్క్ స్మిత లైఫ్, ‘మహానటి’ సినిమాతో సావిత్రి నట ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఆమె చూసిన కీర్తి పతాకాలు, ఎదుర్కొన్న ఒడిదుడుకులు.. ఇలా ప్రేక్షకులు సినీ నటుల బయోపిక్స్ను సినిమాలుగా ఇప్పటికే చూసేశారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి లాంటి లెజెండరీ సింగర్ బయోపిక్ కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
►ALSO READ | Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ హౌస్‌లో రణరంగం.. టెంపర్ వంశీ - రోహిత్ మధ్య బిగ్ ఫైట్..!
