ఐబొమ్మ రవి... ఈ పేరు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పైరసీ సైట్ తో టాలీవుడ్ కి ముచ్చెమటలు పట్టించాడు ఐబొమ్మ రవి. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ కి చుక్కలు చూపించిన రవి ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు. కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించి కండిషన్ బెయిల్ మీద బయటికొచ్చాడు. ఇక ఐబొమ్మ ఇబొమ్మ శకం ముగిసింది. రవి గురించి జనం కూడా మరిచిపోయారు. చాన్నాళ్ల తర్వాత ఐబొమ్మ రవి పేరు వినిపిస్తోంది. నాంపల్లి కోర్టులో రవి దాఖలు చేసిన పిటిషన్ ఇందుకు కారణం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా కొన్ని అకౌంట్లను అయినా అన్ ఫ్రీజ్ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు రవి. తన కేసు దర్యాప్తు భాగంగా బ్యాంకు అకౌంట్లు, ప్రాపర్టీ డిపాజిట్లు ఫ్రీజ్ చేశారని..అప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పిటిషన్లో పేర్కొన్నాడు రవి.
కుటుంబ పోషణ, నిత్యావసరాలు, వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నానని.. ఫీజ్ చేసిన ఖాతాల్లో కొన్నిటిని అయినా అన్ ఫ్రీజ్ చేయించాలని కోర్టును కోరాడు రవి. కుటుంబ జీవనం సాగించేందుకు ఖాతాలు అన్‌ఫ్రీజ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు రవి. రవి దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు పోలీసుల వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | నాకేం తెలియదు.. నోటీసులు ఎత్తివేస్తే లండన్ పోయి నా భర్తను పంపిస్తా : నిజాలు చెప్పకుండా నందన కండీషన్స్!
