ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఓ వ్యక్తికి 2 వేల ఎకరాలా.. శంషాబాద్లో మైంహోం భూములపై సీఎం రేవంత్ విస్మయం !

ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఓ వ్యక్తికి 2 వేల ఎకరాలా.. శంషాబాద్లో మైంహోం భూములపై సీఎం రేవంత్ విస్మయం !

హైదరాబాద్: కేసీఆర్ హోమే మైహోం అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. మైహోంకు శంషాబాద్లో 2 వేల 463 ఎకరాలు ఉందని.. ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఓ వ్యక్తికి 2 వేల ఎకరాలా అని సీఎం విస్తుపోయారు. మైహోం ఎవరి బినామీనో తెలియదా అని సభలో సభ్యులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కాప్రాలో ఎవాక్యు భూములను మైహోంకు కట్టబెట్టారని, మేళ్ల చెర్వులో భూదాన్ భూములను మైహోంకు పట్టా చేశారని సీఎం వివరించారు. ధరణి తెచ్చి మేళ్ల చెర్వు భూమిని మైహోంకు కట్టబెట్టారని ఆరోపించారు. మొత్తం లక్ష కోట్ల భూకుంభకోణం జరిగిందని.. భూకుంభకోణంపై స్పెషల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

మైహోం పేరుతో శంషాబాద్ పరిధిలోని 5 గ్రామాల్లో భూములు కొన్నారని.. ఈ ఆస్తులను 28 కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని సీఎం చెప్పారు. అసైన్డ్, పేదల భూములను మైహోం లాక్కుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ భూ దందాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను బయటపెట్టడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. సర్వే నెంబర్లతో సహా భూముల వివరాలను సీఎం బయటపెట్టడంతో బీఆర్ఎస్ నేతలు డైలమాలో ఉన్నారు.

ALSO READ : సీజ్ చేసిన సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్ కొట్టేశా

ఉద్యమాలు చేసినవాళ్లు సర్వం కోల్పోయారని, ఉద్యమకారుడి ఏ చరిత్ర చూసినా ఇదే ఉంటుందని సీఎం వివరించారు. కానీ.. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.