కేసీఆర్ అండ్ ఫ్యామిలీ భూముల వివరాలు ఇవే..

కేసీఆర్ అండ్ ఫ్యామిలీ భూముల వివరాలు ఇవే..

తెలంగాణాలో భూముల అంశానికి సంబంధించి 22Aపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం ( సెప్టెంబర్ 16 ) అసెంబ్లీలో మాట్లాడుతూ కేసీఆర్ ఫ్యామిలీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. చరిత్రలో ఉద్యమాలు చేసినోళ్లు సర్వం కోల్పోయారని.. తెలంగాణ ఉద్యమకారుడు మాత్రం వేలకోట్లు సంపాదించాడని అన్నారు. ఏ ఉద్యమకారుడు కూడా ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టలేదని అన్నారు సీఎం రేవంత్.

కేసీఆర్ అండ్ ఫ్యామిలీ భూముల వివరాలు ఇవే :

  • కేసీఆర్, అతని భార్య శోభ పేరున సిద్ధిపేటలో 67 ఎకరాలు భూమి
  • కేటీఆర్ అండ్ ఫ్యామిలీ కింద 123 ఎకరాలు
  • కేటీఆర్ పేరుతో 49 ఎకరాలు
  • భార్య శైలజ పేరుతో 17.50 ఎకరాలు
  • కుమార్తె అలేఖ్య పేరుపై 9.3 ఎకరాలు
  • కుమారుడు హిమాన్ష్ పేరుపై 46.23 ఎకరాలు
  • హరీశ్ రావు 21 అతని భార్య పేరుపై 8.50 ఎకరాలు.. మొత్తం 30.50 ఎకరాలు
  • కవిత పేరుపై మహబూబ్ నగర్ లో 14 ఎకరాలు
  • కవిత భర్త పేరుపై 23 ఎకరాలు ఉంది..మొత్తం 37 ఎకరాలు
  • జోగినిపల్లి సంతోషరావు తండ్రి పేరుపై 53.16 ఎకరాలు
  • సంతోషరావు పేరుపై 18.21 ఎకరాలు
  • సంతోషరావు భార్య పేరుపై 7.23 ఎకరాలు.. మొత్తం 79 ఎకరాలు ఉంది.
  • నవీన్ కుమార్ 52 ఎకరాలు, కొండల్ రావు 48 ఎకరాలు ఉంది

మొత్తంగా తొమ్మిది జిల్లాల్లో.. 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439 ఎకరాల భూమి కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై ఉంది. 440 ఎకరాలు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉన్నాయని.. కేటీఆర్ దగ్గర 129 ఎకరాలు ఉన్నాయని అన్నారు సీఎం రేవంత్ 

►ALSO READ | నిషేధిత జాబితాలో భూముల తొలగింపుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు