భారత్ vs వెస్టిండీస్ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే.. వన్డే, టీ20 మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడంటే!

భారత్ vs వెస్టిండీస్ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే.. వన్డే, టీ20 మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడంటే!

India vs West Indies: ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌పై సాధించిన భారీ విజయం ఇచ్చిన ఊపులో ఉన్న టీమిండియా ముందు అత్యంత రసవత్తరమైన హోమ్ సీజన్ కాచుకుని ఉంది. ఈ నెల చివర్లో వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20ల భారీ సిరీస్ ప్రారంభం కానుండగా, అదే సమయంలో జపాన్‌లో ఏషియన్ గేమ్స్ 2026 జరగనుండటంతో భారత సెలెక్టర్లకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. ఈ రెండు వేర్వేరు టోర్నీల కోసం ఒకేసారి రెండు వేర్వేరు జట్లను ప్రకటించేందుకు బీసీసీఐ పక్కా స్కెచ్ వేసింది.

ఒకేసారి రెండు భారత జట్లు.. పంత్, జడేజా రీఎంట్రీ: 

బుధవారం (సెప్టెంబర్ 16న) విండీస్ సిరీస్‌తో పాటు ఏషియన్ గేమ్స్‌కు వెళ్లే జట్లను బీసీసీఐ అధికారికంగా వెల్లడించనుంది. జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరిగే ఏషియన్ గేమ్స్‌లో భారత్ సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. దీంతో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, ఇషాన్ కిషన్‌లను జపాన్ కి పంపుతున్నారు. ఈ క్రమంలో విండీస్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కోసం రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్‌లకు పిలుపు రావడం దాదాపు ఖాయమైంది.

►ALSO READ | వేటు వేస్తారని ముందే తెలిసిపోయిందా?: హర్మన్‌తో గొడవ.. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీకి నిగర్ సుల్తానా గుడ్‌బై?

సిరాజ్ దండయాత్ర.. జడేజా కమ్‌బ్యాక్: 

స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాను మళ్లీ వన్డే జట్టులోకి తీసుకురావాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు మయాంక్ యాదవ్, గుర్‌నూర్ బ్రార్, అశోక్ శర్మల పేర్లను పరిశీలిస్తున్నారు. రెండు బలమైన జట్లను బరిలోకి దింపి, అటు ఆసియా ఖండంలో స్వర్ణం కొట్టడంతో పాటు హోమ్ గ్రౌండ్‌లో విండీస్‌ను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా భారత జట్టు పావులు కదుపుతోంది.

తేదీ                    మ్యాచ్ వివరాలు                                 వేదిక                                 సమయం
సెప్టెంబర్ 27            భారత్ vs వెస్ట్ ఇండీస్ (1వ వన్డే)    తిరువనంతపురం             మధ్యాహ్నం 2:00
సెప్టెంబర్ 30            భారత్ vs వెస్ట్ ఇండీస్ (2వ వన్డే)    గువాహటి                            మధ్యాహ్నం 2:00
అక్టోబర్ 03                భారత్ vs వెస్ట్ ఇండీస్ (3వ వన్డే)    న్యూ ఛండీగఢ్                   మధ్యాహ్నం 2:00
అక్టోబర్ 06                భారత్ vs వెస్ట్ ఇండీస్ (1వ టీ20)    లక్నో                                    రాత్రి 7:00
అక్టోబర్ 09                భారత్ vs వెస్ట్ ఇండీస్ (2వ టీ20)    రాంచీ                                   రాత్రి 7:00
అక్టోబర్ 11                భారత్ vs వెస్ట్ ఇండీస్ (3వ టీ20)    ఇండోర్                                 రాత్రి 7:00
అక్టోబర్ 14                భారత్ vs వెస్ట్ ఇండీస్ (4వ టీ20)    హైదరాబాద్                           రాత్రి 7:00
అక్టోబర్ 17                భారత్ vs వెస్ట్ ఇండీస్ (5వ టీ20)    బెంగళూరు                             రాత్రి 7:00