డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌తో వస్తున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్.. 'ఆస్మాన్' టీజర్ రిలీజ్!

డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌తో వస్తున్న  శ్రీహరి తనయుడు మేఘాంశ్.. 'ఆస్మాన్' టీజర్ రిలీజ్!

దివంగత రియల్ స్టార్ శ్రీహరి మాస్ లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి సిద్ధమయ్యారు. 'రాజ్ దూత్'  తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం తీసుకొని .. సరికొత్త అవతార్ లో 'ఆస్మాన్' ( Aasmaan ) మూవీతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నారు. రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హర్రర్ , డార్క్ మిస్టరీ థ్రిల్లర్ టీజర్ ను లేటెస్ట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ నెట్టింట విపరీతమైన హైప్ ను క్రియేట్ చేస్తోంది.

"మీరిప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోకచిలుకలా మారాలి" అనే మైండ్-బెండింగ్ డైలాగ్‌తో ఈ టీజర్ మొదలవుతుంది. మొదటి సెకను నుంచే ప్రేక్షకులను ఒక మిస్టీరియస్ వరల్డ్‌లోకి తీసుకెళ్తుంది. ఒక సీక్రెట్ కల్ట్ గ్రూప్, చర్చి బ్యాక్‌డ్రాప్, ట్రాన్స్‌లో ఉండే విచిత్రమైన వ్యక్తులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ చిత్రంలో మేఘాంశ్ లీడ్ రోల్‌లో అత్యంత రగ్గడ్, మాస్ లుక్‌లో కనిపిస్తూ పవర్‌ఫుల్ యాక్షన్ స్టంట్స్‌తో మెప్పించారు.

ఇక మేఘాంశ్ సరసన రాయంచ కథానాయికగా నటిస్తుండగా.. రవి వర్మ, కమల్ కేశవ, దీపక్, నిఖిల్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. ప్రశాంత్ విహారి అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) టీజర్‌కు ప్రాణంగా నిలిచి.. థ్రిల్ ఎలిమెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్ళింది. తండ్రికి తగ్గ తనయుడిగా, సాధారణ మాస్ కథల జోలికి పోకుండా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న మేఘాంశ్.. 

►ALSO READ | హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి 'మహారాజ' రీమేక్.. తమిళ సినీ చరిత్రలో తొలి రికార్డ్!

 శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై కొండారు శ్రీనివాస్ రావు సమర్పణలో, రామ్ నందన్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. కేవలం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనే కాకుండా ఏకంగా అరబిక్ భాషలో కూడా పాన్-వరల్డ్ రేంజ్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డార్క్ కల్ట్ థ్రిల్లర్‌తో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టిస్తారో చూడాలి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.